మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లను దూరం పెట్టాలి: నిమ్మగడ్డ కీలక ఆదేశం

By narsimha lodeFirst Published Feb 28, 2021, 5:20 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లను దూరం పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో ఆయన ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. 


అమరావతి: మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లను దూరం పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో ఆయన ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. 

ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఎన్నికల్లో వాలంటీర్లు పాల్గొనవద్దని ఆయన కోరారు.ఏ పార్టీకి కానీ అభ్యర్ధికి వాలంటీర్లు ప్రచారం చేయకూడదని ఆయన సూచించారు. 
ఫోటో, ఓటరు స్లిప్పులు ఇవ్వకూడదని కోరారు. 

వాలంటీర్లపై గట్టి నిఘా పెట్టాలని ఆయన జిల్లా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.  గ్రామపంచాయితీ ఎన్నికల విషయంలో  వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేశారని టీడీపీ ఆరోపించింది.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఆయన మీడియా సమావేశంలో కూడ ప్రకటనలు చేశారు.మార్చి మాసంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు రెండు రోజుల క్రితం కొట్టివేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 

click me!