ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి

Published : Sep 03, 2018, 01:31 PM ISTUpdated : Sep 09, 2018, 11:24 AM IST
ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి

సారాంశం

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా  తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని  కాంగ్రెస్ పార్టీ నేత  రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వంద సీట్లు గెలిచే సత్తా  టీఆర్ఎస్‌కు ఉంటే  ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకొంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు


హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా  తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని  కాంగ్రెస్ పార్టీ నేత  రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వంద సీట్లు గెలిచే సత్తా  టీఆర్ఎస్‌కు ఉంటే  ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకొంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాల కంటే ఇతర అంశాలను కూడ తమ ప్రభుత్వం అమలు చేసినట్టుగా ప్రగతి నివేదన సభలో కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తాంచారు.  టీఆర్ఎస్ మేనిఫెస్టోలో  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఓ సలహ కమిటీని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హమీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు.

తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకొన్న  అమరుల వివరాలను ఎందుకు సక్రమంగా  సేకరించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్ లో  తెలంగాణ సాధన కోసం  ఆత్మ బలిదానం చేసుకొన్నారో లేదో తెలుసుకొనేందుకు ఆ సర్వే పత్రాన్ని తయారు చేయలేదో చెప్పాలన్నారు.

51 మాసాలైనా తెలంగాణ అమర వీరుల  స్థూపం ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ఆరోగ్యభీమా విషయంలో కూడ కేసీఆర్ సర్కార్  హమీలు అమలు కావడం లేదన్నారు.

తెలంగాణలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి  వేధింపులకు గురి చేస్తున్నారని  ఆయన ఆరోపణలు చేశారు. ప్రగతి నివేదన సభకు కనీసం మూడున్నర లక్షల మంది కంటే ఎక్కు మంది కూడ రాలేదన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆత్మరక్షణలో పడినట్టుగా  ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం చూస్తే అర్థమౌతోందన్నారు.  ప్రభుత్వ ఖర్చులతో టీఆర్ఎస్ సభను ఏర్పాటు చేసుకొన్నారని  రేవంత్ ఆరోపణలు చేశారు.

ఎన్నికలు  వచ్చిన సమయంలోతెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకొనేందుకు  ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. సమైఖ్య రాష్ట్రం కోసం  ఎంపీ పదవికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణకు  స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని  చెప్పడం ఓట్ల కోసమేనని ఆయన చెప్పారు.  అంతేకాదు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకొన్న  అమరుల కుటుంబాల కోసం ఏం చేశారో చెప్పాలని  ఆయన  ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌