కాంగ్రెస్‌కి మరో షాక్: అనుచరులతో నేడు భేటీ, బీజేపీలోకి రామారావు పాటిల్?

By narsimha lode  |  First Published Nov 14, 2022, 10:04 AM IST

కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రామారావు పాటిల్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం సాగుతుంది.ఇవాళ బైంసాలో రామారావు పాటిల్ అనుచరులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో పాటిల్ తన నిర్ణయాన్నిప్రకటించనున్నారు.


హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామారావు పాటిల్  కాంగ్రెస్ ను వీడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ  ప్రచారానికి బలం చేకూరేలా రామారావు పాటిల్ ఇవాళ తన అనుచరులతో సమావేశం కానున్నారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామారావు పాటిల్ ముథోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ముథోల్ లో ఓటమి  పాలైన తర్వాత  నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ముథోల్  నుండి పోటీ చేసేందుకు  ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు

.అయితే కాంగ్రెస్ పార్టీ నుండి  కాకుండా బీజేపీ నుండి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన భావిస్తున్నారని  ప్రచారం సాగుతుంది.దీంతో ఆయన కొంతకాలంగా బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నట్టుగా  సమాచారం.రెండు రోజులుగా రామారావు పాటిల్ కాంగ్రెస్ ను వీడుతారనే  ప్రచారం సాగుతుంది.తన అనుచరులతో చర్చించిన అనంతరం రామారావు  పాటిల్ పార్టీ మార్పు విషయమై ప్రకటించనున్నారు.ఇవాళ బైంసాలో  ఏర్పాటు చేసిన సమావేశంలో తన నిర్ణయాన్ని పాటిల్ ప్రకటించే అవకాశం  ఉంది.కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు నేతలు  కూడా పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతుంది.

Latest Videos

రామారావు పాటిల్ తో కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు  చర్చించినట్టుగా తెలుస్తుంది.పార్టీ మారొద్దని  పాటిల్ ను  కోరారని సమాచారం. అయితే రామారావు పాటిల్ ఎలాంటి నిర్ణయం  తీసుకొంటారో ఇవాళ సాయంత్రం తేలనుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్నిహస్తగతం చేసుకోవాలని బీజేపీ  వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.రాష్ట్రంలోని పలు పార్టీల్లోని అసంతృప్తనేతలకు గాలం  వేస్తుంది.ఈ క్రమంలోనే రామారావు  పాటిల్ తో బీజేపీ  నేతలు  టచ్ లోకి  వెళ్లినట్టుగా  చెబుతున్నారు.2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ  కైవసం చేసుకుంది. గతంలో  ఇదే ఎంపీ స్థానం నుండి విజయం సాధించిన  రమేష్ రాథోడ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు.టీడీపీ నుండి టీఆర్ఎస్ లో   చేరిన  రాథోడ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ ను వీడిన రాథోడ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. 

click me!