టీఆర్ఎస్ కి షాక్.. పార్టీని వీడిన మహిళా నేత

Published : Dec 02, 2018, 12:19 PM IST
టీఆర్ఎస్ కి షాక్.. పార్టీని వీడిన మహిళా నేత

సారాంశం

 టీఆర్ఎస్ మధిర పట్టణ అధ్యక్షురాలు గూడెల్లి ఉషారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ మధిర పట్టణ అధ్యక్షురాలు గూడెల్లి ఉషారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ  మధిర అభ్యర్థి  మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం భట్టి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ఉషారాణి కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మధిర నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారుస్తానని భట్టి విక్రమార్క ప్రకటించారు.  కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు అనుబంధంగా ఎర్రుపాలెంలో డ్రై పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలకు కారమవుతున్న నకిలీ విత్తనాలను లేకుండా చేస్తామని, వందకోట్ల వ్యయంతో మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మధిరను స్మార్ట్‌ సిటీగా చేసి, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

తోటి ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఉద‌య్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్టులు
Revanth Reddy: హైడ్రా విష‌యంలో అస్స‌లు త‌గ్గేదేలే లేదు.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు