
హైదరాబాద్: తాము ఎవరికీ వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయలేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత Marri Shashidhar Reddy తేల్చి చెప్పారు. మూడేళ్లుగా తాము తరచుగా కలుస్తున్నామని ఆయన వివరించారు.
ఆదివారం నాడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని శశిధర్ రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ పీసీసీకి Revanth Reddy , పంజాబ్ సీఎంగా చన్నీని, ఉత్తరాఖండ్ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీకి రావత్ ను ఎంపిక చేయడాన్ని తాము ఏనాడూ తప్పుబట్టడం లేదన్నారు.
తాము ఇవాళ సమావేశం కావడం కొత్తకాదన్నారు. Congress పార్టీ శ్రేయస్సు కోసం తాము తరచుగా సమావేశమౌతున్నామని శశిధర్ రెడ్డి చెప్పారు. పార్టీని కాపాడుకోవడం కోసం ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నామని శశిధర్ రెడ్డి చెప్పారు. మీడియాలో జరుగుతున్నట్టుగా తమది అసమ్మతి సమావేశం కాదని శశిధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాము మూడేళ్ల నుండి కలుసుకుంటున్నామని శశిధర్ రెడ్డి చెప్పారు.
Telanganaలో వచ్చే ఎన్నికల్లో పార్టీ మనగడకే కీలకమైన ఎన్నికలని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు Huzurabad ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిందన్నారు. ఈ తరహా ఫలితాలు తెలంగాణలో రావొద్దనే కోరిక తమ పార్టీ నేతలందరిలో ఉందని శశిధర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో కూడా తాము కలుస్తామని శశిధర్ రెడ్డి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాల తర్వాత ఈ తరహా ఫలితాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై వ్యూహారచన అవసరమన్నారు. గతంలో కూడా ఉమ్మడి Andra pradesh రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనుకొన్న సమయంలో Chenna Reddy నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ NTR ను ఓడించి అధికారంలోకి వచ్చిన విషయాన్ని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. జయంతి, వర్ధంతుల సమయంలో నేతలను గుర్తు చేసుకోవడమే కాదు ఆ నేతల స్పూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బాధ్యత గల పార్టీ విధేయులుగా పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ నమ్మకంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రానున్న రోజుల్లో పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని తాము కోరుకుంటున్నామని కూడా శశిధర్ రెడ్డి చెప్పారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. రానున్న ఎణ్నికల్లో పార్టీని వజయం వైపునకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో విజయాలు అందుకున్న చరిత్ర ఉమ్మడి ఏపీ రాస్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు ఉన్న విషయాన్ని శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీని విజయ పథం వైపునకు తీసుకెళ్లేందుకు తాము సీనియర్లతో చర్చిస్తున్నామన్నారు. చాలా కాలంగా తాము ఈ విషయమై చర్చిస్తున్నామని శశిధర్ రెడ్డి చెప్పారు. ఈ వషయాలపై పార్టీ నాయకత్వానికి తాము నివేదిక కూడా ఇవ్వాలని భావిస్తున్నామని శశిధర్ రెడ్డి తెలిపాు.