
హైదరాబాద్: తనకు ఏ ఒక్కరి నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశానికి హాజరు కావొద్దని చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు.ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశానికి Jagga Reddy హాజరయ్యారు.ఈ సందర్భంగా ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. తనపై పార్టీ అధిష్టానానికి Revanth Reddy, మాణికం ఠాగూర్ తప్పుడు సమాచారం అందించారని చెప్పారు. పార్టీ నేత మహేష్ గౌడ్ తో తాను ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్ లో చేరుతానని పార్టీ అధినాయకత్వానికి చెప్పించారని జగ్గారెడ్డి మండిపడ్డారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకున్నా కూడా తాను పార్టీలోనే కొనసాగుతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తమకు అనుమానాలున్నాయని జగ్గారెడ్డి తెలిపారు.
;పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశం వల్ల పార్టీని నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. Hanumantha Rao తనకు ఫోన్ చేసి ఈ సమావేశానికి రావాలని కోరారు. అందుకే ఈ సమావేశానికి హాజరైనట్టుగా జగ్గారెడ్డి చెప్పారు. గతంలో శశిధర్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో మీడియాకు చెప్పకూడదని నిర్ణయం తీసుకొన్నామన్నారు.
తాను కూడా Sonia gandhi Rahhul ganhiల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో చోటు చేసుకొన్న సమస్యలపై చర్చించేందుకు గాను Manickam Tagore చొరవ చూపడం లేదన్నారు. ఈ విషయమై తాము సమావేశమై సోనియా, రాహుల్ లకు వివరించాలని ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డి తీరుపై జగగ్గారెడ్డి గతంలో కూడా బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనపై తప్పుుడు ప్రాచరం చేస్తున్నారని కూడా జగ్గారెడ్డి మండిపడ్డారు. పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్ లో చర్చించకుండా కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకోవడంపై కూడా జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉమమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించే సమయంలో తనకు సమాచారం లేకుండా పర్యటించడాన్ని కూడా జగ్గారెడ్డి తప్పు బట్టారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా జగ్గారెడ్డి గత మాసంలో ప్రకటించారు. అయితే పార్టీ సీనియర్లు సూచనతో తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకొంటున్నట్టుగా తెలిపారు. జగ్గారెడ్డికి ఇటీవలనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జత కలిశారు.
గతంలో పొన్నాల లక్ష్మయ్య నివాసంలో సీనియర్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో సీనియర్లు చర్చించారు. ఇవాళ మూడో సమావేశం జరపాలని నిర్ణయం తీసుకొన్నారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సోనియా, రాహుల్ గాంధీలకు నివేదిక ఇవ్వాలని కూడా సీనియర్లు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత సీనియర్లు ఆయన వ్యవహరశైలిపై మండిపడ్డారు.
ఏకపక్షంగా రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారని సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయమై పలుమార్లు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.