గజ్వేల్ మీటింగ్ తర్వాత కేసీఆర్ ఆస్పత్రికే...: మర్రి

By Arun Kumar PFirst Published Dec 5, 2018, 4:19 PM IST
Highlights

గజ్వేల్ ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభ తర్వాత కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో చేరనున్నట్లు కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగు టీఆర్ఎస్ ఓడిపోనుందని తేలింది కాబట్టి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనైనా గెలిచి పరువు నిలుపుకుందామని కేసీఆర్ భారీ డ్రామాకు ప్లాన్ చేశారని తెలిపారు. 

ఎలాగూ ఇవాళ సాయంత్రం 5గంటల తర్వాత ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడనుంది. అందువల్ల గజ్వేల్ సభ తర్వాత చంద్రశేఖరరావు స్పృహతప్పుతారని తెలిపారు. దీంతో ఆయన్ను యశోదా ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని  డాక్టర్లు చెబుతారు. దీంతో ప్రజల్లో సానుభూతి ఏర్పడి టీఆర్ఎస్ పార్టీకి, గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కు ప్రజలు ఓట్లేస్తారని పథకం వేశారని మర్రి శశిధర్ రెడ్డి వెల్లడించారు. 

 ఈ ఫథకం మొత్తం టీఆర్ఎస్ పార్టీ ముందస్తు వ్యూహంలో భాగమేనని...మరికొద్ది సేపట్లో ఆ డ్రామా మొదలవుతుందని మర్రి స్పష్టం చేశారు. విశ్వసనీయంగా తనకు అందిన సమాచారంతోనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు మర్రి తెలిపారు.  
 
click me!