
హైదరాబాద్: కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం అక్రమార్జనకు పాల్పడిందన్నారు. కవిత, హరీష్ రావుల బండారాన్ని రేపు బయట పెడతానని ఆయన హెచ్చరించారు.
శనివారం నాడు హైద్రాబాద్‌లో మధు యాష్కీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లతో కేసీఆర్ కుటుంబం విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ఆయన ఆరోపించారు.కేసీఆర్, ఆస్తుల పెరిగాయన్న దానిపై తాను చర్చకు సిద్దమని యాష్కీ సవాల్ చేశారు. ఈ సవాల్‌కు స్పందించాలన్నారు.
దుబాయ్ శేఖర్, శేఖర్‌మామగా కేసీఆర్ ఎదిగారని, కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్‌రావు అని తెలిపారు. కేసీఆర్ కుటుంబానిది దరిద్రపుగొట్టు చరిత్ర అని మధుయాష్కి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ బతుకేంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.
కేసీఆర్ అక్రమాస్తులపై ప్రజలు తిరగబడతారనే భయంతో బాత్‌రూమ్‌లను కూడ బుల్లెట్‌ఫ్రూఫ్‌తో నిర్మించుకొన్నారని మధు యాష్కీఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం సంక్షేమం కావాలో, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తన ఆస్తులను కాపాడుకొనేందుకు కేసీఆర్ మోడీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.హవాయి చెప్పుల హరీశ్‌రావు బండారాన్ని బయటపెడతానని అన్నారు.
సంబంధిత వార్తలు
రేపు కవిత చిట్టా విప్పుతా: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై యాష్కీ సంచలనం