ఆయన చీఫ్ సెక్రటరీ కాదు... కేసీఆర్ అక్రమార్జనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్: సోమేశ్‌‌పై మధుయాష్కీ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 17, 2021, 9:12 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. భూముల అమ్మకం వెనుక భూ కుంభకోణం వుందని మధుయాష్కీ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితి నెలకొదన్నారు

సీఎస్ సోమేశ్ కుమార్.. కేసీఆర్ కుటుంబాన్ని అక్రమార్జన నుంచి కాపాడే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మారిపోయారంటూ మధుయాష్కీ ఆరోపించారు. త్వరలో యూనివర్సిటీల పర్యటన చేపడతామని ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో నాయకుడు పర్యటిస్తాడని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. పర్యటన తర్వాత నిరుద్యోగ సమస్యపై దీక్ష చేస్తామన్నారు. భూముల అమ్మకం వెనుక భూ కుంభకోణం వుందని మధుయాష్కీ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితి నెలకొదన్నారు.

ALso Read:ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రాదు.. సీఎస్ పోస్ట్ ఇచ్చారు : సోమేశ్ కుమార్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

భూ కుంభకోణంపై భూములు పరిశీలన చేస్తామని ఆయన తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్‌కి భూముల పరిశీలన బాధ్యతలు అప్పగించినట్లు మధుయాష్కీ తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కార్యాచరణ ఉంటుందని.. మండల, బ్లాక్ కాంగ్రెస్ నేతలతో పీసీసీ సమావేశం అవుతుందని మధుయాష్కీ తెలిపారు. హుజురాబాద్‌లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు జెండా పండుగ నిర్వహిస్తామన్నారు. పీసీసీ కార్యక్రమాల అమలు బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్‌కు అప్పగించినట్లు మధుయాష్కీ తెలిపారు. పోడు భూములపై ఆందోళన  కోసం ఓ కమిటీని నియమిస్తామన్నారు. 

click me!