వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం అంశానికి సంబంధించి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు.ఈ ఏడాది ఆగస్టు చివరలో సోనియాతో వైఎస్ షర్మిల భేటీ అయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనంపై వేచి చూడాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.సోమవారంనాడు న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీతో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీకి సంబంధించి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సోనియా , రాహుల్ గాంధీలతో వైఎస్ షర్మిల చర్చించారన్నారు. వారి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయన్నారు. వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా వేచి చూడాలని ఆయన సమాధానమిచ్చారు.
ఈ ఏడాది ఆగస్టు 31న న్యూఢిల్లీలో సోనియాగాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయమై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత వైఎస్ షర్మిల మీడియాతో కూడ మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీలతో తాను జరిపిన చర్చలు నిర్మాణాత్మకంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్‌టీపీ విలీనం గురించి మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు.
also read:సోనియాతో షర్మిల భేటీ: కౌంటర్ వ్యూహం, కేసీఆర్‌కు చెక్ పెడుతారా?
LIVE: Congress party briefing by Shri and Shri at AICC HQ. https://t.co/lTuwT3aLlq
— Congress (@INCIndia)LIVE: Congress party briefing by Shri and Shri at AICC HQ. https://t.co/lTuwT3aLlq
— Congress (@INCIndia)కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌టీపీ విలీనం చేసేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఆమె కాంగ్రెస్ పార్టీతో రాయబారాలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో వైఎస్ షర్మిల భేటీకి శివకుమార్ మధ్యవర్తిత్వం వహించారు. అయితే వైఎస్ షర్మిల సేవలను తెలంగాణకే పరిమితం చేస్తారా, ఆంద్రలో ఉపయోగించుకుంటారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్ షర్మిల సేవలను తెలంగాణలో ఉపయోగించుకోవడంపై అసంతృప్తితో ఉన్నారు. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ కు నష్టమనే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు నేతలు ఈ అభిప్రాయంతో విబేధిస్తున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రచారం చేస్తే నష్టం ఏమిటనే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.