అందుకే పార్థసారథికి కేసీఆర్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published May 21, 2022, 4:56 PM IST
Highlights

టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థఆయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ అవగాహనతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రజా పరిపాలన సాగడం లేదని.. బిజినెస్ పాలన నడుస్తోంద విమర్శించారు.

టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థఆయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీ అవగాహనతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ప్రజా పరిపాలన సాగడం లేదని.. బిజినెస్ పాలన నడుస్తోంద విమర్శించారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ విలువలు పొగొట్టిందని విమర్శించారు. హెటిరో పార్థసారధిని రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారనేది ప్రశ్నార్థకం అని అన్నారు. ఐటీ రైడ్స్‌లో రూ. 500 కోట్ల దొరికిన వ్యక్తికి కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. పార్థసారథి కరోనా సమయంలో రెమిడిసివర్ తయారు చేసి ప్రజలను దోచుకున్నారని.. ప్రజల రక్తాని పీల్చి కోట్లు సంపాదించారని ఆరోపించారు. 

ఆ పైసలతోని కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని దుర్మార్గపు ఆలోచనలతోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదన్నారు. తెలంగాణలో రైతులు చచ్చిపోతే దిక్కులేదని విమర్శంచారు. తెలంగాణ రైతులకు ఇచ్చిన తర్వాత హర్యానా రైతులకు ఇస్తే బాగుంటుందన్నారు. 

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని.. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని.. ఇదేం రాజకీయమో అని అనుమానం వస్తుందన్నారు. ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వాగతం పలికారని చెప్పారు. కానీ మోదీ వచ్చే సమయంలో కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మోదీ పర్మిషన్‌తోనే కేసీఆర్.. హర్యానాకు వెళ్లారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అంతర్గతంగా అండర్ స్టాండింగ్‌తో ముందుకు వెళ్తున్నాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఈ మూడు పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. 

బండి సంజయ్‌ కేవలం మీడియేటర్ మాత్రమేనని విమర్శించారు. సంజయ్ మాట విని కేసీఆర్‌ను ప్రధాని మోదీ జైలులో పెడతారా అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కు మాటకు బీజేపీలో విలువ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఫేక్ పార్టీ.. బండి సంజయ్‌వి ఫేక్ మాటలు అని విమర్శించారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని.. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టడం పార్టీ చరిత్రలో లేదని అన్నారు. 
 
టీఆర్ఎస్ డబ్బులు పార్థసారథి దగ్గర ఉన్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేసేందుకే పార్థసారధికి టికెట్ ఇచ్చారని విమర్శించారు. కొంత సెక్యూరిటీ ఉంటం కోసమే పార్థసారథికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని విమర్శించారు.

click me!