కేసీఆర్ భర్త్ డే... కేక్ కట్ చేసినంత ఈజీగా పీకలు కోసి: మంథని హత్యలపై వీహెచ్

Arun Kumar P   | Asianet News
Published : Feb 21, 2021, 09:16 AM ISTUpdated : Feb 21, 2021, 09:21 AM IST
కేసీఆర్ భర్త్ డే... కేక్ కట్ చేసినంత ఈజీగా పీకలు కోసి: మంథని హత్యలపై వీహెచ్

సారాంశం

 మొక్కలు నాటడం, కేకులు కట్ చేయడంతో పాటే ఈ దారుణ హత్యలు కూడా కేసీఆర్ పుట్టినరోజునే జరిగాయి కాబట్టి ప్రతి ఏడాది కేసీఆర్ పుట్టినరోజున ఈ జంటహత్యల గురించి ప్రజలు మాట్లాడుకుంటారని వీహెచ్ పేర్కొన్నారు. 

మంథని:  హైకోర్టు లాయర్ దంపతుల దారుణ హత్యపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హన్మంతరావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున కేకులు కోసినంత ఈజీగా న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల పీకలు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చడం దారుణమన్నారు.  మొక్కలు నాటడం, కేకులు కట్ చేయడంతో పాటే ఈ దారుణ హత్యలు కూడా కేసీఆర్ పుట్టినరోజునే జరిగాయన్నారు. కాబట్టి ప్రతి ఏడాది కేసీఆర్ పుట్టినరోజున ఈ జంటహత్యల గురించి ప్రజలు మాట్లాడుకుంటారని వీహెచ్ పేర్కొన్నారు. 

ఇటీవల నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయిన న్యాయవాద దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగులో మృతుల కుటుంబ సభ్యులను వీహెచ్ పరామర్శించారు. అనంతరం వీహెచ్ మాట్లాడులూ... సీఎం కేసీఆర్ పుట్టిరోజున ఇంత దారుణ హత్యలు జరిగితే... అందులో టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం వున్నా మంత్రులు, ఆ పార్టీ నాయకులు స్పందించకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబం అనుమానాలను పరిగణలోకి తీసుకుని  టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పేరు నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడంలేదని వీహెచ్ ప్రశ్నించారు.

read more   ప్రతి దానికి లిటిగేషన్, వామన్‌రావు అరాచకాల చిట్టా ఇదే: గ్రామస్తుడి సంచలన ఆరోపణలు

న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, వెంకటనాగమణిని హత్యచేసిన స్థలాన్ని హన్మంతరావు పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. నడిరోడ్డుపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు
Syrup: మీ ఇంట్లో ఈ సిర‌ప్ ఉందా? వెంట‌నే బ‌య‌ట‌ ప‌డేయండి.. తెలంగాణ ప్ర‌భుత్వం అల‌ర్ట్‌