తెలంగాణకు వ్యతిరేకమని చిరు, పవన్‌లనే వద్దనుకున్నా: దాసోజు శ్రవణ్

By Siva KodatiFirst Published Feb 27, 2021, 4:59 PM IST
Highlights

తనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీ.కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. పైసలిచ్చి మంత్రి పదవి కనుక్కొని, తనను గొట్టంగాడు అంటావా అంటూ మండిపడ్డారు. 

తనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీ.కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. పైసలిచ్చి మంత్రి పదవి కనుక్కొని, తనను గొట్టంగాడు అంటావా అంటూ మండిపడ్డారు.

సామాజిక న్యాయం అనే సిద్ధాంతంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని.. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పోరాడానని శ్రవణ్ పేర్కొన్నారు.

2009లో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్లినప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో తాను కుటుంబసభ్యుడినని.. వాళ్లింట్లో సొంత తమ్ముడిని చూసుకున్నట్లు చూశారని ఆయన వెల్లడించారు.

అయినప్పటికీ వాళ్లు తెలంగాణకు వ్యతిరేకం అన్నప్పుడు.. వారిని తిరస్కరించి రోడ్ల మీదకు వచ్చానని శ్రవణ్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు చంద్రబాబు సంక నాకుతూ తిరిగి, ఉద్యమానికి వెన్నెపోటు పొడిచే ప్రయత్నం చేశావంటూ తలసానిపై మండిపడ్డారు.

చివరికి ఉద్యమకారులపై దాడులు చేసే ప్రయత్నం చేసిన ఆకురౌడీవని, నువ్వు ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడటమేంటీ అంటూ శ్రవణ్ ఫైరయ్యారు. కావాలంటే మోండా మార్కెట్‌లో ఆలుగడ్డల గురించి మాట్లాడుకోవచ్చంటూ ఆయన సెటైర్లు వేశారు. 

click me!