ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానంపై కాంగ్రెస్ గురి.. ముఖ్య నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి

Published : Aug 01, 2022, 12:52 PM ISTUpdated : Aug 01, 2022, 12:53 PM IST
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే స్థానంపై కాంగ్రెస్ గురి.. ముఖ్య నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి

సారాంశం

ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్థానికంగా బలంగా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా మర్సకోల సరస్వతి కూడా పార్టీలో చేరారు. 

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆసిఫాబాద్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్థానిక నాయ‌కురాలు మర్సకోల సరస్వతిని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ సీటును వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకే కేటాయిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 

హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

ఆసిఫాబాద్ స్థానం ఎస్టీ రిజర్వ్‌డ్‌. ఎంతో కాలం నుంచి ఇక్క‌డ బ‌లమైన అభ్య‌ర్థిని నిల‌బ‌ట్టాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. స‌రస్వ‌తిని పార్టీలో చేర్చుకోవ‌డంతో ఇక అభ్య‌ర్థిత్వం ఖరారు అయిన‌ట్టే అని తెలుస్తోంది. ఒక వేళ ఆమె పోటీ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు లేదా తన సవతి సోదరి అయిన జెడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి లు ఆమెకు ఎన్నిక‌ల్లో ప్ర‌త్యర్థులుగా మార‌నున్నారు. అయితే ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ గణేష్ రాథోడ్ కూడా టికెట్ ఆశిస్తున్నార‌ని ‘డెక్కెన్ క్రానికల్’ ఓ కథనంలో నివేదించింది. 

ఒకే మహిళతో రెండు సార్లు పెళ్లి.. మరో మహిళతో సహజీవనం, కట్నం వద్దంటూనే ఆస్తికోసం అరాచకం..

గత ఎన్నికలకు ముందు సరస్వతి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఆ జ‌రిగిన రాజ‌కీయ పరిణామాల నేప‌థ్యంలో ఆమె పార్టీలో పెద్ద పాత్ర పోషించలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోవ లక్ష్మి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తుంద‌ని, తన‌కు జెడ్పీ చైర్‌పర్సన్ ప‌ద‌వి కావాల‌ని ఆమె ఆకాంక్షించారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో లక్ష్మి ఓడిపోయారు. దీంతో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. దీంతో సరస్వతి రాజకీయంగా సందిగ్ధంలో పడ్డారు.

సరస్వతి తోబుట్టువు అయిన కోట్నాక్ రమేష్ కూడా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రచారం పొందాలని భావిస్తున్నారు. ఇది రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించే అవ‌కాశం ఉంది. కాగా సరస్వతి, లక్ష్మి, రమేష్ లు మొద‌టి గిరిజన మంత్రి అయిన దివంగత కోట్నాక్ భీమ్ రావు సంతానం. అయితే ఈ  ముగ్గురి మధ్య రాజకీయ పోరాటాలు అసాధారణం కాదు, 2014 ఎన్నికలలో సరస్వతి, లక్ష్మి ఒకరితో ఒకరు తలపడ్డారు. అయితే లక్ష్మి గెలిచారు. లక్ష్మి గతంలో 2013 గ్రామపంచాయతీ ఎన్నికల్లో సరస్వతిని ఓడించి ఆసిఫాబాద్ సర్పంచ్ కావడం గా కూడా ఎన్నిక‌య్యారు. 

కేసీనో దందా: ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్

ఆసిఫాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో లక్ష్మి కూతురు అరుణపై కూడా సరస్వతి ఎన్నికల పోరుకు దిగారు. అరుణ ఓడిపోవడంతో సిర్పూర్‌లో టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఖానాపూర్‌లో సరస్వతి తన కుమార్తె తొడసం లీనారావుకు కాంగ్రెస్ టిక్కెట్ కోసం లాబీయింగ్ చేశారు. కానీ అది తిరస్కర‌ణ‌కు గుర‌య్యింది. ఈ పరిణామం తరువాత ఆమె రమేష్‌తో కలిసి లక్ష్మికి మద్దతు ఇచ్చారు సరస్వతిని చేర్చుకోవడానికి ముందే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జెడ్పీ చైర్ పర్సన్ అయిన అత‌డి భార్య భాగ్యలక్ష్మిని కూడా కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్