Revanth Reddy:వచ్చే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనవరి 6వ తేదీ శనివారం నాడు సిద్ధం చేసింది. దీనికి చైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. రేవంత్‌తో పాటు మరో 24 మంది సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఆ జాబితాలో ఎవరెవరికీ చోటు దక్కిందో మీరు కూడా ఓ లూక్కేండీ.
Revanth Reddy: సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఫిబ్రవరి లేదా మార్చి నాటికిఎన్నకల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నిక సమరాన్ని ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి సార్వత్రిక సమరానికి కసరత్తు మొదలు పెట్టాయి. ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయకేతనాన్ని ఎగరవేసిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాస్తా దూకుడు పెంచింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేస్తూ..భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 0స్థాయిలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. తెలంగాణ, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర.. ఈ జాబితాలో ఉన్నాయి.
undefined
ఈ క్రమంలో తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు మొత్తం 25 మందికి ఆ ఎన్నికల కమిటీలో స్థానం కల్పించింది. ఏర్పాటైన కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీ జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా వంటి పలువురు నేతలకు ఆ జాబితాలో చోటు దక్కింది.
ఆ జాబితాలో ఎవరెవరికీ చోటు దక్కిందో మీరు కూడా ఓ లూక్కేండీ.
ఈ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు.