మద్యం మత్తులో ఇద్దరు యువతుల హల్‌చల్

Published : Jun 23, 2019, 11:37 AM ISTUpdated : Jun 23, 2019, 12:52 PM IST
మద్యం మత్తులో ఇద్దరు యువతుల హల్‌చల్

సారాంశం

 మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు శనివారం అర్ధరాత్రి హైద్రాబాద్‌లో హంగామా చేశారు.బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌ సమీపంలో కారులో  వచ్చిన ఇద్దరు యువతులు ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో తిట్టుకొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్: మద్యం మత్తులో ఇద్దరు అమ్మాయిలు శనివారం అర్ధరాత్రి హైద్రాబాద్‌లో హంగామా చేశారు.బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌ సమీపంలో కారులో  వచ్చిన ఇద్దరు యువతులు ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో తిట్టుకొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కేబీఆర్ పార్క్ సమీపంలో ఇద్దరు యువతులు రోడ్డుపై నిలబడి తిట్టుకొన్నారు.  అంతేకాదు ఒకరిపై మరోకరు దాడికి పాల్పడ్డారు.  ఈ విషయం తెలిసిన పోలీసులు కేబీఆర్ పార్క్‌ వద్దకు చేరుకొన్నారు.  

యువతులకు ఎంత నచ్చజెప్పినా యువతులు వినలేదు. పోలీసులతో కూడ ఆ యువతులు దురుసుగా ప్రవర్తించారు.దీంతో కేబీఆర్ పార్క్ సమీపంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ఆరుగురు స్నేహితులు మద్యం మత్తులో గొడవకు దిగారు.  ఆరుగురు స్నేహితుల్లో ఈ ఇద్దరు యువతులున్నారు.  పీకల దాకా మద్యం తాగి రచ్చ రచ్చ చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద  రోడ్డుపైనే ఈ యువతులు గొడవకు దిగారు.

ఇదిలా ఉంటే  జూబ్లీహిల్స్‌లో  పోలీసుల తనిఖీలో మద్యం తాగిన పోలీసులు ఇద్దరు నైజీరియన్లు చుక్కలు చూపించారు.ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాదరావుతో దురుసుగా ప్రవర్తించారు. వీరిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Home: మెట్రో దగ్గర ఇల్లు ఉంటే EMI భారం తగ్గుతుంది.. ఇదెక్కడి లాజిక్ అని ఆలోచిస్తున్నారా.?
Medaram Jatara: మేడారం వెళ్లలేక‌పోతున్నారా.? ఏం ప‌ర్లేదు ప్ర‌సాదం మీ ఇంటికే వ‌స్తుంది. ఎలాగంటే..