
కాంగ్రెస్ ప్రాజెక్ట్స్ ను అడ్డుకుంటోందని హరీష్ రావు అనడం సరికాదన్నారు పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి.
రైతుల నుంచి భూసేకరణ చేయడంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలనేదే మా డిమాండ్ అని తెలిపారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఓపెన్ కట్ పంప్ హౌస్ ను నిర్మించే అవకాశం ఉన్నా .. అండర్ గ్రౌండ్ ఎందుకు నిర్మించారో
హరీష్ సమాధానం చెప్పాలన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పదే పదే తమ పార్టీ అద్యక్షుడిపై హరీష్ విమర్శలు చేయడం మానుకోవాలి సూచించారు. ఇకపై కూడా ఇలాగే హరీష్ విమర్శలు చేస్తే ఆయనకు తగినబుద్ది చెబుతామని అన్నారు.
హరీష్ కాంగ్రెస్ పార్టీ పైనా, నాయకులపైనా అబండాలు వేయడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా భువనగిరిలో బస్వాపూర్ రిజర్వాయర్ భూసేకరణలో తన కుటుంబ సహకారం ఎంతగానో ఉందని ఆయన అన్నారు.
తమ కుటుండబానికి చెందిన 120 ఎకరాల స్వంత భూమిని ప్రాజెక్ట్ కోసం వదులుకున్నామని అన్నారు. అలాంటి తనపై ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నానని మంత్రి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నారాయణ రెడ్డి తెలిపారు.