30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా - మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

By Sairam Indur  |  First Published Jan 1, 2024, 6:49 PM IST

Boora Narsaiah Goud : తెలంగాణలో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలన్నింటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 


గడిచిన 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని, అంతా గుండు సున్నానే అని బీజేపీ (BJP) సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (former MP Boora Narsaiah Goud) ఆరోపించారు. అధికార పార్టీ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు.

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. సీటు కోసం భీకరంగా కొట్టుకున్న మహిళలు.. గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి

Latest Videos

సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శ్వేతపత్రాలే విడుదల చేసిందని విమర్శించారు. ప్రభుత్వం పనిచేస్తోందని నిరూపించేందుకు ఏమీ చేయలేదని అన్నారు. ‘‘రేవంత్ రెడ్డికి ముళ్ల కిరీటం వచ్చింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. దీని వల్ల కొత్త ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోతోందనే విషయం వారికి తెలిసింది. అందుకే వారిలో ఉత్సాహం కనిపించడం లేదు.’’ అని అన్నారు.

భారత్ లో కోవిడ్ కలకలం.. ఒకే రోజు 850 కొత్త కేసులు నమోదు.. ఏడు నెలల్లో ఇదే అత్యధికం..

తెలంగాణ ప్రజలకు బీజేపీ ఒక్కటే ఆశా కిరణంగా కనిపిస్తోందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి అంతా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలన్నింటికీ మోడీ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని తెలిపారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం రూ.9.36 లక్షల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. రాజాసింగ్ ఆగ్రహం.. వీడియో వైరల్

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో బీజేపీ ఎంపీలను పార్లమెంటుకు పంపితే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. దీని వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు.

click me!