కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో వరుస భేటీలు: కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ మీటింగ్

By narsimha lode  |  First Published Jul 25, 2022, 7:46 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన మరునాడే సునీల్ రాజగోపాల్ రెడ్డి తో భేటీ అయ్యారు. 
 


హైదరాబాద్:  Congress పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్  Munugode ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సోమవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకు పైగా Komatireddy Rajagopal Reddy తో చర్చించారు. పార్టీ మారకూడదని సూచించారు  పార్టీ  కూడా సముచిత గౌరవం ఇస్తుందని చెప్పారు. 

రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ ముగిసిన వెంటనే Congress Election Strategist సునీల్ మునుగోడు ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి తో భేటీ అయ్యారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ వ్యవహరిస్తున్నారు.మునుగోడు ఎమ్మెల్యేతో రాజగోపాల్ రెడ్డితో భేటీలో కీలక విషయాలపై చర్చి'స్తున్నట్టుగా సమాచారం.

Latest Videos

undefined

also read:తొందరపాటు చర్యలొద్దని సూచించా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రధానంగా సునీల్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రాష్ట్ర నాయకత్వానికి రాఁహుల్ గాంధీ దిశా నిర్ధేశం చేస్తున్నారు.  ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయమై  సునీల్ ఇచ్చిన సూచనలతోనే ఆయా జిల్లాల నాయకుల నుండి వ్యతిరేకత వచ్చినా కూడా  పార్టీలో చేరికల విషయంలో వెనక్కు తగ్గలేదు. పార్టీలో చేరికల విషయంలో నాయకులు ఎవరూ కూడా అడ్డు చెప్పవద్దని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకులకు సూచించింది.  

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని తాను చెప్పిన మాటలు నిజమైనట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కానీ తన మాటలను పార్టీ నాయకులు తేలికగా తీసుకున్నారన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దించాలనేదే తన తాపత్రయం అని ఆయన చెప్పారు.ఈ విషయమై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా రాజగోపాల్ రెడ్డికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు.

ఇప్పటికే రాష్ట్రంలో రాజకీ య పరిస్థితులు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి, ఏ అభ్యర్ధి పరిస్థితి ఎలా ఉందనే దానిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త నివేదికలను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే పలు నివేదికకను రాహుల్ గాంధీకి అందించారు.  గతంలో తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు ఢిల్లీలో  రాహుల్ గాంధీతో సమావేశంలో సునీల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సునీల్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రాహుల్ గాంధీ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. 

2023లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. అయితే తెలంగాణలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సన్నద్దమౌతుంది. ఈ తరుణంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మారాయి.ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలను కూడా పార్టీ నాయకత్వం తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తుంది. 

రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలను పార్టీ అధినాయకత్వం దృష్టికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి నేతలు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరో వైపు పార్టీ మొదటి నుండి ఉన్న నేతలకు ప్రాధాన్యత లేకపోవడాన్ని కూడా  రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు.


 


 


 

click me!