తెలంగాణ శాసనమండలిలో జీవన్ రెడ్డి... ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

By Arun Kumar PFirst Published Apr 22, 2019, 3:18 PM IST
Highlights

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్  హవా కొనసాగగా ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ పార్టీ ఎదురుగాలి వీచింది. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటమిపాలయ్యారు.  టీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా వుండే మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి విజయం సాధించారు. 

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెంటనే లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలవడంతో ఆయన తన బాధ్యతలు స్వీకరించలేకపోయారు. ఇటీవలే ఆ ఎన్నికలు కూడా ముగియడంతో జీవన్ రెడ్డితో సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయాలని భావించారు. ఈ మేరకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులుతో పాటు కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు సాధారణ ఎన్నికల్లో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అగ్రనేతలతో తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించాయి. దీంతో మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుండి జీవన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి అలుగుబెల్లి నర్సిరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు.  
 
click me!