ఆర్టీసి కార్మికులను కేసిఆర్ భయపెడుతున్నారు : కాంగ్రెస్ చిన్నారెడ్డి

First Published Jun 8, 2018, 5:36 PM IST
Highlights

పాత ముచ్చట మరచిపోయినవా ?

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆర్టీసి కార్మికులను భయపెట్టాలని చూస్తున్నారని, ఇది సమంజసం కాదన్నారు వనపర్తి, ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ జిల్లెల చిన్నారెడ్డ. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ని మూసేస్తాం అని చెప్పడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. ఇవన్నీ మరిచి పి ఆర్ సీ అంశంలో పెంచకపోవడం దారుణమన్నారు. దాదాపు 50వేల కు పైగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించి సమ్మె చేస్తే ఇంటికే అని మాట్లాడడం అన్యాయమన్నారు. ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం సీఎం కేసీఆర్ విధానాలే అని స్పష్టం చేశారు. కార్మికుల వల్ల ఆర్టీసీ నష్టాల్లో లేదని చెప్పారు. ఆర్టీసీ సమ్మెను చేయకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది తప్ప కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగుల పై పని భారం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కక్ష సాధింపు మంచిది కాదన్నారు. ప్రైవేట్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

click me!