మోడీ, కేసీఆర్ సేమ్‌ టూ సేమ్: రాహుల్

By narsimha lodeFirst Published Aug 13, 2018, 5:18 PM IST
Highlights

: ఒకే ఒక కుటుంబం తెలంగాణలో పాలన సాగిస్తోందన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు


హైదరాబాద్: ఒకే ఒక కుటుంబం తెలంగాణలో పాలన సాగిస్తోందన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మహిళా సంఘాల సమస్యలు కేసీఆర్ కు పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.

సోమవారం నాడు  హైద్రాబాద్ క్లాసిక్  కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో రానున్నది  మహిళా సంఘాల ప్రభుత్వమేనని  రాహుల్ ధీమా,ను వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో  మహిళా సంఘాలకు ఏ రకమైన సౌకర్యాలు  అమలయ్యాయో తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయనున్నట్టు  చెప్పారు.యూపీలో డ్వాక్రా సంఘాలు  లేని సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  డ్వాక్రా సంఘాల పనితీరు గురించి తెలుసుకొని  ఇక్కడి నుండి డ్వాక్రా సంఘాలను సహాయంతో యూపీలో  డ్వాక్రా సంఘాలను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. 

కేసీఆర్, మోడీ ప్రభుత్వాలు ధనవంతులు, పారిశ్రామికవేత్తలకే రుణాలను ఇస్తున్నారని  ఆయన ఆరోపించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు రుణాలను ఇవ్వనున్నట్టు చెప్పారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీని కూడ ప్రకటించనున్నట్టు  చెప్పారు. తాము అమలు చేసే హమీలను మాత్రమే ఇవ్వనున్నట్టు చెప్పారు. . 

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  డ్వాక్రా సంఘాలకు ఏ రకమైన సౌకర్యాలు  కల్పించారో  తమ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో   డ్వాక్రా సంఘాలకు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు.
 

click me!