లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీల మధ్య పొత్తు : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టంగ్ స్లిప్.. వీడియో వైరల్

By Sairam Indur  |  First Published Mar 6, 2024, 2:33 PM IST

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ - బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టంగ్ స్లిప్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పరిస్థితిని వినియోగించుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేసింది.


దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ కు కూడా 5 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. 

ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిపోతున్నారు. అలాగే పొత్తుల రాజకీయాలు కూడా ప్రారంభమవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ - బీఎస్పీల మధ్య పొత్తు ఖరారు అయిన సంగతి తెలిసిందే. అయితే బీఎస్పీకి బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు కేటాయిస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 

Latest Videos

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మరో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండబోతోందని కాంగ్రెస్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పరస్పర విరుద్ధ భావజాలు ఉన్న రెండు పార్టీలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబుతున్నట్టు టంగ్ స్లిప్ అయ్యారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతున్నాయని ఆమె అన్నారు. అయితే ఆమె పొరపాటున అన్నారా ? లేక కావాలనే అన్నారా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

పొత్తుపై తడబడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి pic.twitter.com/mtd46OZV8Y

— Ananthagiri News (@AnanthagiriNews)

అసలేం జరిగిందంటే ? 
పాలకర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్-బీఎస్పీల మధ్య కుదిరిన పొత్తుపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆమె కాస్త కంగారు పడ్డారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీకి పొత్తు ఉంటుందని తెలిపారు. ఆమె అనుచరుడు ఆమె మాటలను సరిచేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఓపెన్ అప్ అవుతున్నారుగా..

మొన్న భవిష్యత్తులో మోడీ సహకారం కావాలని రేవంత్ రెడ్డి అనడం

నిన్న మోడీ పర్సనల్ అప్డేట్స్‌ని రేవంత్ రెడ్డి రీపోస్ట్ చేయడం

నేడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనడం… pic.twitter.com/XIr61v7nIy

— BRS Party (@BRSparty)

ఆమె వ్యాఖ్యలను ప్రతిపక్ష బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకుంది. ఆ పార్టీ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా.. యశస్విని రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆమె కాంగ్రెస్ తరుఫున పోటీ చేసినప్పటికీ ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు.

click me!