తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్‌పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అనంతరం కేసీఆర్ చేసిన ప్రసంగంపై పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బల్మూరి వెంకట్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కొత్త ప్రభాకర్‌పై దాడి అనంతరం బాన్సువాడలో బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.కేసీఆర్ ఎన్నికల ప్రసంగం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రసంగం తరువాత కాంగ్రెస్ నేతలపై దాడులు ఎక్కువయ్యాయని బల్మూరి వెంకట్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.