విద్యార్ధి ఉద్యమాలు: మల్లు రవి నేతృత్వంలో కాంగ్రెస్ కమిటీ

By narsimha lode  |  First Published Mar 30, 2023, 3:42 PM IST

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశం నేపథ్యంలో విద్యార్ధి ఉద్యమాలపై  కార్యాచరణకు  కమిటీ ఏర్పాటు  చేయాలని  రేవంత్ రెడ్డి  సూచించారు. దీంతో   కమిటీని  ఏర్పాటు  చేసింది ఆ పార్టీ.


హైదరాబాద్:  విద్యార్ధి ఉద్యమాలపై  కాంగ్రెస్ పార్టీ  కమిటీని ఏర్పాటు  చేసింది.  మాజీ ఎంపీ మల్లు రవి  చైర్మెన్ గా  కాంగ్రెస్ పార్టీ  కమిటీని  ఏర్పాటు  చేసింది.  ఈ కమిటీలో  పలువురికి  చోటు కల్పించారు.   శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్ ,మానవతారాయ్, బాలలక్ష్మి, పవన్, మల్లాదిలకు  చోటు  కల్పించింది  కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో  విద్యార్ధి సమస్యలపై  ఉద్యమాల  నిర్వహణ  కోసం కాంగ్రెస్ పార్టీ  ఈ కమిటీని  ఏర్పాటు  చేసింది.  ఈ కమిటీని  ఏర్పాటు  చేయాలని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  సూచించారు.  రేవంత్ రెడ్డి సూచన మేరకు  ఈ కమిటీని  ఏర్పాటు  చేశారు. 

Latest Videos

టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్  ఘటనపై  విపక్షాలు  ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.  ఈ  విషయమై  రాష్ట్ర ప్రభుత్వంపై  కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు  చేసింది.  మంత్రి కేటీఆర్ పీఏ  తిరుపతికి పాత్ర  ఉందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  పేపర్ లీక్ అంశంతో మంత్రి కేటీఆర్ కు కూడా సంబంధం ఉందని  ఆయన  ఆరోపించారు. 

పేపర్ లీక్ అంశంపై  సిట్ దర్యాప్తు  చేస్తుంది.  ఈ కేసులో  ఇప్పటికే  13 మందిని  సిట్ అరెస్ట్  చేసింది.  గత వారంలో  అరెస్టైన ముగ్గురిని   సిట్  కస్టడీలోకి తీసుకుంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై  రాష్ట్రంలో  కలకలం రేపుతుంది.   ఈ కేసులో  ప్రవీణ్,  రాజశేఖర్ రెడ్డి  ప్రధాన నిందితులుగా  పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో  ఇంకా వెవరెవరికి   సంబంధాులున్నాయనే విషయమై  సిట్  బృందం  విచారిస్తుంది. 

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: రూ. 25 లక్షలు వసూలు చేసిన ఢాక్యానాయక్

తొలుత టీఎస్‌పీఎస్‌సీ లో  కంప్యూటర్లు  హ్యాక్ అయినట్టుగా  అనుమానించారు. అయితే  ఈ కేసును విచారించిన  పోలీసులు  కంప్యూటర్లు  హ్యాక్ కాలేదని గుర్తించారు.  అయితే  ఉద్దేశ్యపూర్వకంగానే  పేపర్లను లీక్ చేశారని  పోలీసులు తమ విచారణలో గుర్తించారు.గత ఏడాది అక్టోబర్ మాసంలో  జరిగిన పరీక్షల సమయంలో నుండే  పేపర్ లీక్  జరిగాయనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ విషయమై కూడా  సిట్ దర్యాప్తు  చేస్తుంది. 

click me!