ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

Published : May 13, 2019, 03:05 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

సారాంశం

రాష్ట్రంలో మూడు జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  


హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

నల్గొండ, వరంగల్, రంగారెడ్డి  జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 14 వ తేదీ లోపుగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు సుదీర్ఘంగా కసరత్తు నిర్వహించింది.

నల్గొండ స్థానానికి కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, రంగారెడ్డి స్థానానికి ఉదయ మోహన్ రెడ్డి, వరంగల్ స్థానానికి ఇనుగుల వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఈ పేర్లను ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా