
తెలంగాణ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ మరోసారి పైర్ అయ్యారు. నిమ్స్ డాక్టర్లకు ఫోన్ చేసి నేరెళ్ల దిళితులకు ట్రీట్ మెంట్ బంద్ చేయిరి అని కేటిఆరే చెప్పిండని విహెచ్ ఆరోపించారు. అందుకే కేటిఆర్ ఆదేశం మేరకు నిమ్స్ డాక్టర్లు అర్థరాత్రిపూట నేరెళ్ల దిళిత బాధితులను ఆసుపత్రి నుంచి డిచ్ఛార్జి చేసి వెళ్లగొట్టిర్రని ఆరోపించారు విహెచ్.
నా జీవితంలో దళితులకు ఇలాంటి అవమానాలు ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారుకు దళితులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మానవీయ కోణంలో ట్రీట్ మెంట్ చేయాల్సింది పోయి వాళ్లను మంత్రి చెప్పిండని బయటకు పంపుడేంది అని ప్రశ్నించారు. ఈనెల 15 నుంచి నిరహారదీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు వి హన్మంతరావు.
కాంగ్రెస్ నేత జానారెడ్డి సైతం నేరెళ్ల దిళిత బాధితులకు వైద్యం నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో చెప్పారని వైద్యం నిలిపివేయడం సరికాదన్నారు. దీనిపై మళ్లీ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని జానారెడ్డి హెచ్చరించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి