తెలంగాణ ఎంసెట్‌లో గందరగోళం: ఫీజులపై క్లారిటీ ఇవ్వని సర్కార్

By Siva KodatiFirst Published Jun 26, 2019, 8:27 PM IST
Highlights

తెలంగాణ ఎంసెట్‌లో గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా నేటి వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలపై ప్రభుత్వం ఇంత వరకు స్పష్టతను ఇవ్వలేదు.

తెలంగాణ ఎంసెట్‌లో గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా నేటి వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనే కాలేజీలపై ప్రభుత్వం ఇంత వరకు స్పష్టతను ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు అయోమయానికి గురవుతున్నాయి.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు నిర్థరాణ కాకపోవడంతో కాలేజీలపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఫీజుల విషయంగా ఇప్పటికే కొన్ని కాలేజీలు కోర్టుకు వెళ్లగా.. కళాశాలలకు అనుకూలంగానే తీర్పు వచ్చింది.

అయితే న్యాయస్థానం కాపీ ఇంకా రాకపోవడమే ఆలస్యానికి కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే 24 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్కార్ వైఖరి కారణంగా రేపటి నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వాయిదాపడే అవకాశముంది. 
 

click me!
Last Updated Jun 26, 2019, 8:27 PM IST
click me!