2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం: శివరాజ్ సింగ్ చౌహాన్

Published : Jun 26, 2019, 06:07 PM IST
2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం: శివరాజ్ సింగ్ చౌహాన్

సారాంశం

2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి వస్తోందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో  బీజేపీకి మెరుగైన ఫలితాలను కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


హైదరాబాద్:  2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి వస్తోందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో  బీజేపీకి మెరుగైన ఫలితాలను కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బుధవారం నాడు  హైద్రాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర పదాదికారుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. అన్ని రంగాల వారిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జూలై 6వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మోడీ ప్రారంభిస్తారన్నారు. 

ఆగష్టు 11వ తేదీ వరకు సభ్యత్వ నమోదు క్యాంపెయిన్  కొనసాగించనున్నట్టు ఆయన చెప్పారు.కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.  కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే