తెలంగాణ సిఎం ఎవరో తెలియదట (వీడియో)

First Published Mar 20, 2018, 11:50 AM IST
Highlights
  • తెలంగాణ సిఎం ఎవరు అని చర్చించుకున్న సచివాలయ సెక్యూరిటీ
  • మమత కు షేక్ హ్యాండ్ ఇచ్చిన కేశవరావు.. హడావిడి

కేసిఆర్ అనే మూడక్షరాల పేరు దేశమంతా మారుమోగింది. తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన తెలంగాణలో తొలి సిఎం అయ్యారు కేసిఆర్. అలాంటి కేసిఆర్ ను పశ్చిమబెంగాల్ లో గుర్తు పట్టలేకపోయారు. అసలు తెలంగాణ సిఎం ఎవరు అని పశ్చిమబెంగాల్ సెక్రటేరియట్ సిబ్బంది ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. బెంగాల్ సచివాలయంలోకి కేసిఆర్ చేరుకుని కారు దిగగానే బెంగాల్ సిఎం మమత పూలగుత్తి అందించి కేసిఆర్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత వెనక నుంచి కారు దిగి వచ్చిన కేశవరావు మమతా బెనర్జీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆమెను నవ్వుతూ పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ సమయంలో మమతకు బొకే ఇచ్చేందుకు బొకే తెప్పించే పనిలో కేసిఆర్ ఉన్నారు. అప్పుడే అక్కడి సచివాలయ సెక్యూరిటీ సిబ్బందికి డౌట్ వచ్చింది. తెలంగాణ సిఎం కౌన్ హై అని వారిలో వాళ్లే చర్చించుకున్నారు. అందులో ఒక వ్యక్తి చేతికి దట్టీ కట్టుకున్న వ్యక్తి తెలంగాణ సిఎం అని బదులిచ్చారు. తర్వాత మమతకు కేసిఆర్ బొకే అందించడంతో అక్కడి నుంచి సమావేశ మందిరానికి అందరూ కలిసి వెళ్లారు. 

 

సెక్యూరిటీ సిబ్బంది సందేహం.. వివరణ తాలూకు వీడియో చూడండి.

click me!