తక్షణమే కుల గణన నిర్వహించండి: కేంద్రాన్ని డిమాండ్ చేసిన వీహెచ్

By Mahesh RajamoniFirst Published Nov 16, 2022, 7:56 PM IST
Highlights

Hyderabad: దేశంలో కుల గణనను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు బుధవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కుల గణనకు సంబంధించిన సరైన సమాచారం లేని కారణంగా న్యాయంగా అందాల్సిన ఫలాలు ఆయా వర్గాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. 
 

Senior Congress leader V Hanumantha Rao: దేశంలో గత కొంత కాలంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియార్ నాయకులు వీ.హనుమంతరావు సైతం కుల గణన అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో కుల గణనను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  కుల గణనకు సంబంధించిన సరైన సమాచారం లేని కారణంగా న్యాయంగా అందాల్సిన ఫలాలు ఆయా వర్గాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. 

వివరాల్లోకెళ్తే.. దేశంలో కుల గణనను వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు బుధవారం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, కుల గణనకు సంబంధించిన డేటా లేకపోవడం వల్ల ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లతో పాటు సంబంధిత వర్గాల వారు విద్య, ఉద్యోగాలు, పలు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్‌లలో వారికి రావాల్సిన ఫలాలను పొందడం లేదని అన్నారు. కుల గణనపైనా, ఓబీసీలపై జాతీయ విధాన పత్రం రూపొందించాలన్నా కేంద్రానికి ఎలాంటి ఆసక్తి లేదని ఆరోపించారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఓబీసీ సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారనీ, ఆయన కేవలం మాటలకే పరిమితం అయ్యారని ఆరోపించారు.  ఇప్పటి వరకు వారి కోసం ఏమీ చేయలేదని వీ.హనుమంతరావు విమర్శించారు. 27 మంది ఓబీసీ ఎంపీలను తన కేబినెట్‌లో చేర్చుకోవడం మినహా, ఓబీసీ వర్గానికి చెందిన ప్రజలకు ప్రధాని చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఓబీసీ ఎంపీలకు కేబినెట్ బెర్త్‌లు వచ్చాయి. సామాన్యుల సంగతేంటి? అని ప్రశ్నించారు. 

వెనుకబడిన వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని వీ.హనుమంతరావు పేర్కొన్నారు. అలాగే, క్రీమీలేయర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. బీసీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.

click me!