కరోనా బాధితులకు సహాయం కోసం క్రౌడ్ ఫండ్ పేరుతో హైద్రాబాద్ కు చెందిన యువకులు భారీ మోసానికి తెర తీశారు. మూడు రోజుల్లో కోటి రూపాయాలను వసూలు చేశారు. ఈ ఫండ్ పై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం వెలుగు చేసింది.
హైదరాబాద్: కరోనా బాధితులకు సహాయం కోసం క్రౌడ్ ఫండ్ పేరుతో హైద్రాబాద్ కు చెందిన యువకులు భారీ మోసానికి తెర తీశారు. మూడు రోజుల్లో కోటి రూపాయాలను వసూలు చేశారు. ఈ ఫండ్ పై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం వెలుగు చేసింది.
కరోనా సోకిన వారికి సహాయం చేసే ఉద్దేశ్యంతో విరాళాలను క్రౌడ్ ఫండింగ్ పేరుతో కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని చూసిన వారు బాధితులకు ఉపయోగపడుతోందనే ఉద్దేశ్యంతో విరాళాలు ఇచ్చారు.
undefined
also read:హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా: కుటుంబసభ్యులకు నెగిటివ్
అయితే కొందరికి ఈ క్రౌడ్ ఫండింగ్ పై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని ఆరు చోట్ల క్రౌడ్ ఫండింగ్ నిర్వాహకులపై పోలీసులకు పిర్యాదులు అందాయి. వీటిపై కేసులు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 1593 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 54,059కి చేరుకొన్నాయి.