నివేదిక అందింది, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: జనార్థన్ రెడ్డి

By Nagaraju penumalaFirst Published Apr 27, 2019, 3:45 PM IST
Highlights

త్రి సభ్య కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎస్ ఎస్.కే జోషితో సమావేశమయ్యారు. నివేదికపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన జనార్థన్ రెడ్డి  ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించిందని స్ఫష్టం చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, నివేదికను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  
 

 హైదరాబాద్: ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన త్రి సభ్య కమిటీ నివేదిక సమర్పించినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. త్రి సభ్య కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం సీఎస్ ఎస్.కే జోషితో సమావేశమయ్యారు. 

నివేదికపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన జనార్థన్ రెడ్డి  ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించిందని స్ఫష్టం చేశారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని, నివేదికను పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

10 పేజీల నివేదిక  సహా 46 పేజీల అనుబంధాలను కమిటీ అందించిందని ఆయన తెలిపారు. ఇకపోతే జిల్లా కేంద్రాలలో రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన క్వాలిటీ వర్క్‌ ఉండేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 

రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన తేదీని పొడిగించలేదని తెలిపారు. 

రోజు వారిగా ఎన్ని పేపర్లు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లు అయ్యాయో తెలిపే వివరాలను ఎప్పటికప్పుడు అందజేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు సెక్రటరీ అశోక్‌ తెలిపారు. 

అందుకు సంబంధించి సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 3 లక్షల 28 వేల మంది ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ చేస్తున్నామని ప్రకటించారు. 

12 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో ఉపయోగించిన స్కానర్స్‌ను ఫలితాల వెల్లడిలో ఉపయోగించాలని కోరినట్లు జనార్థన్ రెడ్డి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇంటర్ ఫలితాల వివాదంపై నివేదిక సమర్పించిన త్రిసభ్యకమిటీ

click me!