దిక్కులేని వారిని చేయకండి.. కాస్త పెద్ద మనసు చేసుకోండి: కేసీఆర్‌కు రచ్చ రవి రిక్వెస్ట్

By Siva Kodati  |  First Published Jul 11, 2020, 4:07 PM IST

కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననం విషయమై సీఎం కేసీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి


భారతదేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో రోజు వారీ కేసుల వృద్ధిలో భారత్‌లో అధిక శాతంగా ఉంది. మరోవైపు తెలంగాణలోనూ కోవిడ్ 19 వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది.

అయితే కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననం విషయమై సీఎం కేసీఆర్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి. వైరస్ బారిన పడి మరణించిన వారి డెడ్ బాడీలను ఓ కంటైనర్‌ బాక్స్‌లో పెట్టి పక్కాగా సీల్ చేసి సంబంధిత కుటుంబాలకు ఇవ్వాలని రవి కోరాడు.

Latest Videos

undefined

ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన అతను ఈ విధంగా వ్యాఖ్యానించాడు. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్కారం. నా మనసులో ఉన్న భాదను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో షేర్ చేస్తున్నాను .

కరోనా మహమ్మారి వల్ల అనాదిగా వస్తున్న ఆచారాలు, సెంటిమెంట్స్ మంటగలిసిపోతున్నాయి. మన కుటుంబసభ్యుల్లో ఎవరైనా కరోనా బారినపడి చనిపోతే.. అందరూ వుండి కూడా దిక్కులేని వారిగా ఖననం చేస్తున్నాం. ఇది అందరినీ తీవ్రంగా బాధిస్తోంది.

సో.. నా రిక్వెస్ట్ ఏంటంటే కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని, వైరస్ లోపలి నుంచి బయటకు రాకుండా ఉండే ఓ స్పెషల్ బాక్సులో పెట్టి కుటుంబీకులకు ఇస్తే.. చివరి చూపు చూసుకుని మళ్లీ అప్పజెప్పడమో లేక మన ప్రభుత్వ రూల్స్ మేరకు ఖననం చేయడమో చేస్తారు.

దీని వల్ల వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేం.. ఇలా చేయకపోవడం వలన ఆ కుటుంబీకుల్లో ఆ క్షోభ వారి జీవితాంతం ఉంటుందని నా భావన. సో.. ప్లీజ్ వారిని ఆ క్షోభకు గురిచేయకుండా పెద్ద మనసు చేసుకుని ఆలోచిస్తారని నేను కోరుకుంటూ.. థాంక్యూ సార్ అని చెప్పాడు.

 

click me!