ఎవరిని సీఎం చేయాలో కేసీఆర్ ఇష్టం.. మీకెందుకు: విపక్షాలపై దానం నాగేందర్ ఫైర్

By Siva KodatiFirst Published Jul 11, 2020, 3:36 PM IST
Highlights

రాష్ట్రం లో కాంగ్రెస్ ,బీజేపీ నేతలు కళ్లుండి చూడలేని కబోధులు లు గా మారారని మండిపడ్డారు టీఎర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. 

రాష్ట్రం లో కాంగ్రెస్ ,బీజేపీ నేతలు కళ్లుండి చూడలేని కబోధులు లు గా మారారని మండిపడ్డారు టీఎర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆరేళ్లుగా తెలంగాణలో గతంలో కనివిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

సచివాలయం కూల్చి వేతపై హైకోర్టును ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయని దానం ఆరోపించారు. అభివృద్ధిపై వేలు పెట్టి చూచించే పరిస్ధితి లేదు కనుకే ప్రజలకు సంబంధం లేని విషయాలపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు.

ప్రతి పక్షాల నేతలు బుద్ది జ్ఞానం లేకుండా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు ఎన్నిసార్లు ఛీకొట్టినా ప్రతిపక్షాలు మారడం లేదని.. ఇప్పటికీ మారకుంటే ప్రతిపక్షాలకు బంగాళాఖాతమే దిక్కని విమర్శించారు.

హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే సచివాలయం కూల్చివేతలు మొదలయ్యాయని.. సచివాలయంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతపై సీఎం కెసిఆర్ ఇప్పటికే వివరణ ఇచ్చారని నాగేందర్ స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల నేతలు జాగ్రత్తగా మసలుకుంటే వారికే మంచిదని.. పాత సచివాలయం భద్రతా ప్రమాణాలకనుగుణంగా చూస్తే పనికి రాదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో సచివాలయంలో అగ్నిప్రమాదాలు జరిగాయని నాగేందర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శని అన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ కూడా రాదని.. ఎవరిని సీఎం చేయాలో అది కేసీఆర్ పరధిలోనిదన్న ఆయన.. దీనిపై ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు ఎక్కడిదని ధ్వజమెత్తారు. విపక్షాలు అనవసర విషయాలపై మాట్లాడే బదులు మౌనంగా ఉండటమే మంచిదని నాగేందర్ హితవు పలికారు. 
 

click me!