సూర్యాపేట చేరుకున్న కల్నల్ సంతోష్ పార్థివదేహం: శోకసంద్రంగా మారిన ఇల్లు

By Sreeharsha GopaganiFirst Published Jun 17, 2020, 11:02 PM IST
Highlights

భారత చైనా సరిహద్దుల్లో, చైనా సైనికుల దుష్టనీతి దాష్టికానికి అమరుడైన తెలుగు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం స్వస్థలం సూర్యాపేటకు చేరుకుంది. లెహ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి తీసుకువచ్చారు. అక్కడి నుండి ఆయన భౌతికకాయాన్ని ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సూర్యాపేటకు తరలించారు.

భారత చైనా సరిహద్దుల్లో, చైనా సైనికుల దుష్టనీతి దాష్టికానికి అమరుడైన తెలుగు కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం స్వస్థలం సూర్యాపేటకు చేరుకుంది. లెహ్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి తీసుకువచ్చారు. 

గవర్నర్ తమిళిసై, కేటీఆర్ అక్కడే కల్నల్ సంతోష్ బాబు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన భార్యను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. అక్కడి నుండి ఆయన భౌతికకాయాన్ని ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సూర్యాపేటకు తరలించారు. ప్రజలు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బయట భారీస్థాయిలో గుమికూడారు. అంబులెన్సు వెంట కూడా పరుగులు తీశారు. జోహార్ కల్నల్ సంతోష్ అంటూ నినాదాలు మిన్నంటాయి. 

సంతోష్ పార్థివదేహం సూర్యాపేట చేరుకోగానే అతని ఇల్లంతా మరోసారి శోకసంద్రంలో మునిగిపోయాయి. సంతోష్ తల్లి, తండ్రి సోదరి, అతని భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. అతని ఇంటిబయట స్థానిక ప్రజలు భారీసంఖ్యలో చేరుకున్నారు. సంతోష్ అమర్ రహే అంటూ నినాదాలు చేసారు. 

సంతోష్ కుమార్ అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన అమరత్వం అందరికి గుర్తిండిపోయేలా, ఆయన వీరమరనాన్ని తలుచుకుంటూ సూర్యాపేటలో సంతోష్ ఫొటోతో మాస్కులు పంచుతున్నారు. 

కరోనా కష్టకాలంలో ప్రజలందరు కూడా మాస్కులను ధరిస్తూ, భౌతికదూరంపాటిస్తు తమను తహము రక్షించుకుంటున్న తరుణంలో, అందునా ఒకప్పటి కరోనా హాట్ స్పాట్ సూర్యాపేటలో ఇలా మాస్కులు పంచడాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 

తమ ఊరి యోధుడిని తాము ఈ విధింగా గుర్తుంచుకుంటూ, గర్వంతో మాస్కులను ధరిస్తామని ప్రజలు చెబుతున్నారు. రేపు సంతోష్ అంత్యక్రియల సమయంలో అందరం ఇదే మాస్కులను ధరిస్తామని అంటున్నారు. 

కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేట జిల్లా వాసి. సూర్యాపేట లోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసాడు. ఆ తరువాత కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రవేశపరీక్ష రాసి అందులో ఉత్తీర్ణుడయి విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక పాఠశాలలో 6వ తరగతి నుండి 12వతరగతి వరకు విద్యను అభ్యసించాడు. 

చిన్నప్పటినుండి సైన్యంలో చేరాలని కలలుగన్న సంతోష్ బాబు అందుకు తగ్గట్టుగానే కోరుకొండ సైనిక్ స్కూల్ లో చేరాడు. ఆతరువాత ఎన్డీయే ఎగ్జామ్ క్లియర్ చేసి పూణే ఎన్డీఏ లో డిగ్రీ పూర్తి చేసాడు. ఆతరువాత ఆఫీసర్ స్థాయి అధికారిగా డెహ్రాడూన్ లో ట్రైన్ అయ్యాడు. 

ట్రైనింగ్ పూర్తయిన అనంతరం ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో వచ్చింది. అతి చిన్న వయసులోనే సంతోష్ కల్నల్ స్థాయికి ఎదిగారు. 2004లో ఆర్మీలో చేరిన సంతోష్ బాబు, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, పుల్వామా ఇలా అనేక ప్రాంతాల్లో పనిచేసారు. 

click me!