సిటీ సిపి దిష్టిబొమ్మ కాలబెట్టిన జర్నలిస్టులు

Published : Jul 21, 2017, 05:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
సిటీ సిపి దిష్టిబొమ్మ కాలబెట్టిన జర్నలిస్టులు

సారాంశం

కమిషనర్ మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్థం జర్నలిస్టు నాగరాజుకు న్యాయం చేయాలని డిమాండ్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్న జర్నలిస్టులు

జర్నలిస్టు నాగరాజుపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసు పెద్దలు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ జర్నలిస్టులు సిటీ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ కాలబెట్టారు. మలక్ పేటలో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నగర జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకారణంగా జర్నలిస్టు నాగరాజుపై దాడిచేసిన ఎస్సైతోపాటు కానిస్టేబళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై చర్య తీసుకోవడంలో తాత్సారం చేస్తే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని జర్నలిస్టులు హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సత్యం, శ్రీకాంత్ యాదవ్, అనీల్ కుమార్, రాహుల్, శ్రీరాములు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Ameerpet Fire: అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంఅసలు కారణాలు ఇవే వెల్లడించిన అధికారులు| Asianet News Telugu
పాతబస్తీలో కేటీఆర్ సందడి..Osmania Biscuits in Old City Hyd | KTR Charminar Visit | Asianet Telugu