రెవెన్యూ అధికారులపై వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి సీరియస్

First Published Jun 13, 2018, 2:52 PM IST
Highlights

ముగ్గురు అధికారుల సస్పెన్షన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాలన కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన జిల్లా రెవెన్యూ ఉద్యోగులపై వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు క్షేత్ర స్థాయితో నిర్లక్ష్యానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. 

పది రోజుల క్రితం జిల్లాలోని ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆమ్రపాలి  ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి సిబ్బందితో సమావేశమైన ఆమె భూ రికార్డుల పక్షాలన ఎలా జరుగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాదా బైనామా, విరాసత్ భూముల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరు సిబ్బందికి అసలు ఈ వివరాలపై అవగాహన లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇలా అవగాహన లేకుండా గ్రామాల్లో ఎలా పనిచేస్తారంటూ సదరు అధికారులను నిలదీశారు.

తాజాగా అలా  అవగాహన లేకుండా భూ రికార్డుల ప్రక్షాలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కలెక్టర్ వేటు వేశారు. మండల ఆర్ఐ శ్రీధర్ తో పాటు జీల్గుల,జగన్నాథపూర్‌, కోతులనడుమ గ్రామాల వీఆర్‌వో చంద్రమౌళిని, తిమ్మాపూర్‌, బావుపేట గ్రామాల వీఆర్‌వో తిరుపతి ని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఎల్కతుర్తి తహసీల్దార్‌ మల్లేశం వెల్లడించారు. 

 

click me!