వామ్మో చలి.. తెలంగాణను ముంచెత్తుతున్న శీతల గాలులు.. ఇంకెన్ని రోజులు ఉంటాయంటే ?

By team teluguFirst Published Dec 24, 2022, 9:41 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత మూడు రోజుల నుంచి విపరీతంగా చల్లగాలులు వీస్తున్నాయి. మరికొంత కాలం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

తెలంగాణ రాష్ట్రాన్ని చలి ముంచెత్తుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా శీతలగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వల్ల వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పట్లో ఈ పరిస్థితి తగ్గకపోవచ్చని, మరి కొంత కాలం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు, నాలుగు రోజుల పాటు చల్లగాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణలోని 16 జిల్లాలకు ఎల్లో-కోడెడ్ హెచ్చరిక జారీ చేసింది.

మార్నింగ్ వాక్ కు వెళ్లి మాయం.. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న యువకుడు అడవిలో శవంగా.. ఏమైందంటే..

గడిచిన మూడు రోజుల్లో చలి కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 9.6 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 9.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

సికింద్రాబాద్‌లో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యం.. సిద్ధిపేట ట్రేస్ చేసిన పోలీసులు

నగరంలోని రాజేంద్రనగర్‌లో శుక్రవారం అత్యల్పంగా 11.3 డిగ్రీల సెల్సియస్, అల్వాల్‌లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజుల పాటు నగరంతో పాటు రాష్ట్రంలోని 16 జిల్లాలకు ఐఎండీ ఎల్లో-కోడెడ్ హెచ్చరిక జారీ చేసింది. అయితే రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రులు 10-14 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఇంతలా చలి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ పేర్కొంది.

పోర్న్ స్టార్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. వీడియో తీసుకుని ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం, పరిస్తితి విషమం..

ఈ చలి ప్రభావంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చలి నుంచి రక్షణ పొందే దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు. చల్లగాలులు వీస్తున్న సమయంలో అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని తెలియజేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ఈ చలి పరిస్థితులు తగ్గేవరకు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

click me!