అదృష్టమంటే ఇదేనేమో..! పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి.. కోటీశ్వరుడయ్యాడు

Published : Dec 23, 2022, 11:56 PM IST
అదృష్టమంటే ఇదేనేమో..!   పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి.. కోటీశ్వరుడయ్యాడు

సారాంశం

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడికి భారీ లాటరీ తగిలింది. జిల్లాలోని బీర్పూర్ మండలం తుంగూరుకు చెందిన అజయ్ దుబాయ్ లోని ఓ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అక్కడ కొద్ది రోజుల క్రితం అతడు 30 దిర్హమై రెండు లాటరీ టికెట్స్ కొనుగోలు చేశాడు. నేడు లాటరీ తీయగా.. అతడికి రూ.30 కోట్ల లాటరీ తగిలింది.

అదృష్టం.. ఎవరిని? ఎప్పుడు ? ఎలా ? వరిస్తుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. తెలియకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారిని అదృష్ట దేవత వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేస్తుంది. సాధారణంగా ఏదైనా చిన్న బహుమతిని గెలుచుకుంటేనే.. చాలా హ్యాపీగా  ఫీలవుతాం. అలాంటిది పొట్టకూటి కోసం దుబాయికి వెళ్లిన వ్యక్తికి   లాటరీలో భారీ జాక్ పాట్ తగిలింది. ఒకటికాదు..రెండుకాదు.. ఏకంగా రూ. 30 కోట్లు గెలుచుకున్నాడు. ఇలా అదృష్ట దేవత వరించడంతో జగిత్యాల జిల్లాకు చెందిన అజయ్ అనే యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. 

వివరాల్లోకెళ్లే.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్ కు చెందిన ఓగుల దేవరాజం- ప్రమీల దంపతుల కుమారుడు అజయ్. చదివిన చదువుకు సరైన ఉపాధి దొరక్క.. పొట్టకూటి కోసం ఇటీవల దుబాయ్ కి వలస వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో డ్రైవర్ గా పనిలో చేరాడు. గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ లో 15 దిర్హమ్ పెట్టి ఎమిరేట్స్ డ్రాలో లాటరీ టికెట్ కొన్నాడు. తాను కొన్న టికెట్ కు 30 కోట్ల లాటరీ తగలింది. దీంతో అజయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అజయ్ కి రూ.30 కోట్లు డ్రా గెలుచుకోవడం పట్ల అతని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అజయ్ ఓ వీడియో రికార్డు చేసి పంపాడు. నేను దుబాయ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ లీగల్ గా ఉన్న ఎమి గ్రేడ్స్ డ్రాలోడ్ నెంబర్ తీశాను. ఇందులో దుబాయ్ మనీ 15 మిలియన్ తగిలింది, ఇది ఇండియన్ మనీలో 30 కోట్ల వరకు ఉంటుందని అజయ్ తన సంతోషం వ్యక్తం చేశారు  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్