సీఎం రేవంత్ కు ఓటమి భయం పట్టుకుందా..? ఈ కామెంట్స్ వింటే అవుననిపిస్తోంది...

By Arun Kumar PFirst Published Apr 22, 2024, 2:48 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికల భయం పట్టుకుందా..? అసెంబ్లీ ఎన్నికల ఫలితమే లోక్ సభ లో వుండదని ఆయన భావిస్తున్నారా? అంటే ఆయన ఇటీవల చేస్తున్న కామెంట్స్ అవును అనేలాగే వున్నాయి....

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరునెలలు కూడా కాలేదు అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఈ లోక్ సభ ఎన్నికలు కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. మరీముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివి. అధికారంలో వుండికూడా పార్టీని గెలిపించుకోలేకపోతే రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించేవారు పెరిగిపోతారు. అందువల్లే రేవంత్ కూడా లోక్ సభ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని నెరవేర్చకపోవడం ఈ లోక్ సభ ఎన్నికలపై ఏమైనా ప్రభావం చూపుతుందేమో అన్న భయం రేవంత్ కు పట్టుకున్నట్లుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ చేస్తున్న కామెంట్స్ ఈ అనుమానాలను రేకెత్తిస్తోంది. 

కాంగ్రెస్ ఓడితే జరిగేదిదేనా...?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి సీఎం రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం హామీ ఇచ్చామని... కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేర్చినట్లు రేవంత్ గుర్తుచేసారు. అయితే ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుందని ... మహిళలు ఆలోచించి ఓటు వేయాలని  రేవంత్ సూచించారు. 

రుణమాఫీపై దేవుడిై ఒట్టు.. : 

అంతేకాదు రైతులకు రెండు లక్షల రుణమాపీ గురించి కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్ సభ ఎన్నికలు ముగియగానే రుణమాపీ ప్రక్రియ చేపడతామని... ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం వరకు రైతుల రుణాలు మాపీ అవుతాయన్నారు.  రైతుల రుణాలను మాఫీ చేసి తీరతానని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసారు సీఎం రేవంత్. 

కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆగిపోతుంది - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/XaTqt7pEAF

— Telugu Scribe (@TeluguScribe)

కొడంగల్ లో సానుభూతి పొందే వ్యాఖ్యలు : 

ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని అధికారంలోకి వచ్చాం... అందరి అశిస్సులతో తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ తెలిపారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి లు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని రేవంత్ అన్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గించి కిందపడేయాలని చూస్తున్నారని అన్నారు. కాబట్టి ఈ కుతంత్రాలను పసిగట్టి మీ బిడ్డకు అండగా నిలవాలని ... లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలంటూ రేవంత్ సెంటిమెంట్ రగిల్చారు. 

అంతకుముందు  కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో చర్చలోనూ రేవంత్ ఇలాంటి కామెంట్స్ చేసారు. తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ను ఓడించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని... వారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని నాయకులకు రేవంత్ సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. 

రేవంత్ కామెంట్స్ లో ఓటమి భయం :  

ఇలా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై కాన్పిడెంట్ గా లేరని అర్థం అవుతుంది. బిఆర్ఎస్ అంత బలంగా కనిపించకున్నా బిజెపి ఎక్కడ తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందో అన్న అనుమానం రేవంత్ కు వున్నట్లుంది. అందువల్లే బిజెపి వ్యతిరేక ప్రచారంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు.  

ఇటీవల అధికారంలోకి రాగానే కాంగ్రెస్ కొన్ని పథకాలను అమలుచేసింది. అందులో ముఖ్యమైనది మహిళలకు ఫ్రీ బస్ పథకం. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే ఈ ఫ్రీ బస్ సదపాయం, రైతులకు రుణమాపీ వుంటుంది అనేలా రేవంత్ మాట్లాడారు. ఈ కామెంట్సే ఆయనలో దాగివున్న భయాన్ని బయటపడేలా చేసాయి.   


 

click me!