తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో దూకుడు పెంచింది. తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వున్న భద్రతను తొలగించింది. ఎవరెవరికి భద్రత అవసరం అనే దానిపై సమీక్ష అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో దూకుడు పెంచింది. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రేవంత్ ప్రభుత్వం .. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దృష్టి సారించింది. తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వున్న భద్రతను తొలగించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. సర్కార్ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత కలిపిస్తున్న సాయుధులైన పోలీసులను వెనక్కి పిలిచారు ఉన్నతాధికారులు. ఎవరెవరికి భద్రత అవసరం అనే దానిపై సమీక్ష అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా వీరిలో కొందరికి భద్రత పునరుద్ధరించే అవకాశం వుంది.