దాడులు ఎందుకు..? పీఏసీ మెంబర్‌ హోదాలో అడిగిన రమేశ్.. మూడు రోజుల్లోనే ఐటీ రైడ్

By sivanagaprasad kodatiFirst Published Oct 12, 2018, 9:33 AM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ దాడులు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతుండటంతో.. దీనిపై ప్రస్తుతం పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పీఏసీ మెంబర్ హోదాలో దేశంలో ఐటీ దాడులు, ఎక్కడ, ఎందుకు చేస్తున్నారని.. ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన ఐటీ దాడుల వివరాలు ఇవ్వాలని సీఎం రమేశ్ ఐటీశాఖకు నోటీసులు పంపారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేశ్ ఆస్తులపై ఐటీ దాడులు జరగడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

60 మంది అధికారుల బృందం కడప, హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, వ్యాపార కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహించింది. 

click me!