ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Siva Kodati |  
Published : Apr 27, 2023, 06:09 PM ISTUpdated : Apr 27, 2023, 06:14 PM IST
ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

సారాంశం

మే 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు.

ఢిల్లీలో నిర్మిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు. 

ఇకపోతే.. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ గతేడాది సెప్టెంబర్ 2న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 1100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తున్నారు. త్రీ ప్లస్ త్రీ రీతిలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. దీని ప్రారంభోత్సవానికి దేశంలోని పలు పార్టీల అధినేతలను ఆహ్వానించి.. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం