Telangana: సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ రద్దు !

By Mahesh RajamoniFirst Published Jan 18, 2022, 3:12 AM IST
Highlights

Telangana CM KCR: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వ‌ర్షాల కార‌ణంగా తీవ్రంగా పంట న‌ష్టం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్..  వ‌రంగ‌ల్ లో దెబ్బ‌తిన్న పంటలను పరిశీలించాలని భావించారు. అయితే, ఆయ‌న వ‌రంగ‌ల్ టూర్‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని స‌మాచారం. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి.. ప‌లువురు ఉన్న‌తాధికారులు ఈ ప‌ర్య‌ట‌న‌ను కొన‌సాగించ‌నున్నార‌ని తెలిసింది. 
 

Telangana CM KCR: తెలంగాణలో ఇటీవ‌ల ప‌లు చోట్ల ఆకాల వ‌ర్షాలు అన్న‌దాత‌ల‌ను కోలుకోని విధంగా దెబ్బ‌తీశాయి. ఆరుగాలం క‌ష్టించి పండించిన పంట‌ను న‌ష్ట‌ప‌రిచాయి. దీంతో అన్న‌దాత‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా అకాల వ‌ర్షం కార‌ణంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. చాలా ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR).. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షాలో దెబ్బ‌తిన్న రైతుల పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్ (Warangal) ప‌ర్య‌ట‌నను ర‌ద్దు చేసుకున్నార‌ని స‌మాచారం. అయితే,  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి.. ప‌లువురు ఉన్న‌తాధికారులు ఈ ప‌ర్య‌ట‌న‌ను కొన‌సాగించ‌నున్నార‌ని తెలిసింది.  వీరు న‌ష్ట‌పోయిన రైతుల‌ను స్వ‌యంగా క‌ల‌వ‌డంతో పాటు వారి పంట పోలాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 

కాగా, అంత‌కుముందు.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ (Warangal) ప్రాంతాల్లో అకాల వ‌ర్షం కార‌ణంగా పంట దెబ్బ‌తిని  రైతులు న‌ష్ట‌పోయిన విష‌యాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో, నర్సంపేట మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరగడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆధ్వర్యంలో  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు సోమ‌వారం నాడు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని సీఎం కేసీఆర్‌ (CM KCR) హామీనిచ్చారు.  అయితే, కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సీఎం కేసీఆర్ ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నార‌నీ, వ్యవసాయ  (Agriculture) శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనను కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం. 

తెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచింది. ఖరీఫ్‌ సీజన్‌లో అకాల వర్షాలతో ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు. కాగా, సోమ‌వారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో (Pragati Bhavan‌) తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశమైన విషయం తెలిసిందే. తెలంగాణలోని కరోనా పరిస్థితులతో పాటు పలు ఇత‌ర అంశాలపై  కూడా క్యాబినెట్ చర్చించింది. ఈ క్రమంలోనే వ్యవసాయంపై (Agriculture) కూడా కేబినెట్ చర్చించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్  వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని భావించారు. ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరిందని అధికారులు క్యాబినెట్‌కు వెల్ల‌డించారు. అయితే వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. 

సోమ‌వారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో (Pragati Bhavan‌) తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌యివేటు స్కూళ్లు, జూనియ‌ర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజు నియంత్రణకు కొత్త చట్టం తీసుకు రావాలనిTelangana Cabinet నిర్ణయం తీసుకొంది. వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకురావాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. 
 

click me!