గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగరేసిన కేసీఆర్

By Arun Kumar PFirst Published Aug 15, 2018, 10:43 AM IST
Highlights

భారతదేశ 72వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుండి చారిత్రక కట్టడమైన గోల్కొండ కోటలో ఈ వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఏడాది ఈ వేడులకల కోసం గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అలాగే ఈ 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కూడా గోల్కొండ కొటలోనే ఘనంగా జరిగుతున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ ప్రజలనేద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

అంతకు ముందు కేసీఆర్ నేరుగా పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్థూపం వద్ద ఘన నివాళి అర్పించారు. అక్కడినుండి నేరుగా గోల్కొండ కోటకు చేరుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ జాతీయ దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాధారణ ప్రజలు పాల్గొన్నారు. 

click me!