నా ఇంట్లో దెయ్యం, అందుకే అక్కడ పడుకోను: కలెక్టర్ ఆమ్రపాలి

Published : Aug 15, 2018, 09:21 AM ISTUpdated : Sep 09, 2018, 01:01 PM IST
నా ఇంట్లో దెయ్యం, అందుకే అక్కడ పడుకోను: కలెక్టర్ ఆమ్రపాలి

సారాంశం

 తాను నివాసం ఉంటున్న అధికారిక భవనంలో దెయ్యం ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.  


వరంగల్:  తాను నివాసం ఉంటున్న అధికారిక భవనంలో దెయ్యం ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.

తనకు దెయ్యాలంటే చాలా భయమని ఆమె చెప్పారు.వరంగల్ లో తాను నివాసం ఉంటున్న భవనానికి 133 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన విషయాన్ని ఆమె  గుర్తు చేసుకొన్నారు. 133 ఏళ్ల క్రితం ఆగష్టు 10వ తేదీన ఈ భవనానికి శంకుస్థాపన చేసినట్టుగా ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

జార్జ్ పామర్ అనే గొప్ప ఇంజనీర్ భార్య ఈ క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని తాను తెలుసుకొన్నట్టు చెప్పారు. జార్జ్ పామర్ గురించి తెలుసుకోవడానికి తాను చాలా కష్టపడినట్టు ఆమె చెప్పారు.

నిజాం నవాబు కాలంలో పనిచేసిన ఇంజనీర్లలో పేరొందిన ఇంజనీర్ పామర్  అని తనకు తెలిసిందన్నారు. అయితే ఈ భవనంలో  నివాసం ఉన్న కలెక్టర్లు ఈ భవనం మొదటి అంతస్థులో దెయ్యం ఉందని చెప్పారని గుర్తు చేసుకొన్నారు. అయితే తాను ఈ భవనంలోని మొదటి అంతస్థును పరిశీలించినట్టు చెప్పారు. గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే వాటిని సర్థి పెట్టించినట్టు చెప్పారు.

అయితే ఈ గదిలో దెయ్యం ఉందనే భయంతో తాను ఎప్పుడూ ఈ గదిలో పడుకోవడానికి సాహసించబోనని ఆమె చెప్పారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది