కేసీఆర్ పెద్దమనసు.. యువతి వైద్యానికి రూ.25 లక్షల సాయం

By Siva KodatiFirst Published Oct 12, 2021, 10:13 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద యువతి చికిత్స ఖర్చుల నిమిత్తం రూ. 25 లక్షలు మంజూరు చేశారు. అంతేకాకుండా యువతికి మంచి చికిత్స ఇప్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద యువతి చికిత్స ఖర్చుల నిమిత్తం రూ. 25 లక్షలు మంజూరు చేశారు. అంతేకాకుండా యువతికి మంచి చికిత్స ఇప్పించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. వివరాల్లోకి వెళితే వనపర్తి (wanaparthy) జిల్లా రేవల్లికి చెందిన శివాని (shivani).. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (Paroxysmal nocturnal hemoglobinuria) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందకుంటే ప్రాణాలే పోయే అవకాశం వుంది. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌తో ప్రాణాలు నిలిపే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ, చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అది కూడా హైదరాబాద్‌లోని (continental hospital) కాంటినెంటల్ ఆసుపత్రిలో మాత్రమే ఈ అరుదైన చికిత్స చేసే అవకాశం ఉంది.

ALso Read:కొత్తపల్లి ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి... మృతులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థికసాయం

అయితే, శివాని తండ్రి బాల్ రెడ్డి (bal reddy) క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితమే ఉపాధి నిమిత్తం రేవల్లి నుంచి వలసవెళ్లి హైదరాబాద్ పీర్జాదిగూడలో కుటుంబంతో స్థిరపడ్డాడు. అద్దె ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్న అతడు.. కూతురి ఆరోగ్య పరిస్థితి విషయమై వనపర్తి ఎమ్మెల్యే మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని (minister niranjan reddy) సంప్రదించారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి.. విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చలించిపోయిన సీఎం కేసీఆర్ ఆమె చికిత్సకు రూ. 25 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను మంగళవారం వనపర్తిలోని తన నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి.. బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తమ కూతురు వైద్యానికి సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్ రెడ్డికి శివాని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 

"

click me!