శాలపల్లి: నాడు రైతుబంధు, నేడు దళితబంధు శ్రీకారానికి ప్లాన్

By narsimha lode  |  First Published Aug 4, 2021, 1:14 PM IST


రైతు బంధు ప్రారంభించిన గ్రామంలోనే  దళిత బంధు ప్రారంభించేందుకు కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శాలపల్లిలో దళితబంధును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.



కరీంనగర్: పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని  హుజూరాబాద్ నియోజకవర్గంలో  ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గతంలో రైతు బంధు పథకాన్ని ఏ గ్రామంలో ప్రారంభించారో అదే గ్రామంలోనే దళిత బంధు పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్  భావిస్తోంది.2018 లో హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామంలో  దళితబంధు పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. రైతు బంధు పథకం ఈ గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం చాలా విజయవంతంగా అమలు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఇతర అధికారులు ఈ గ్రామాన్ని మంగళవారం నాడు సందర్శించారు.

ఈ నెల 16వ తేదీన శాలపల్లి గ్రామంలో దళితబంధు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1 లక్షమంది పాల్గొనే అవకాశం ఉంది.దళిత బంధును హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఈ పథకాన్ని  అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ ను విపక్షాలు కోరుతున్నాయి.

Latest Videos

 
 

click me!