యశోదా ఆసుపత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్... ఎర్రవల్లి నుంచి నేరుగా సోమాజిగూడకి

By Siva Kodati  |  First Published Apr 21, 2021, 8:08 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. సాధారణ హెల్త్ చెకప్‌తో పాటు, కేసీఆర్‌కు సిటీ స్కాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి తిరిగి సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో వున్న తన ఫామ్‌హౌస్‌‌కు వెళ్లనున్నారు. 

కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎంకు కరోనా సోకడం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు.

Latest Videos

undefined

కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. మరోవైపు నోముల భగత్‌కు కూడా కరోనా సోకింది.

Also Read:కేసీఆర్ కు కరోనా: కొంప ముంచిన నాగార్జునసాగర్ ప్రచార సభ?

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కు రాపిడ్ టెస్టులు చేశామని, కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన చెప్పారు.

ఫామ్ హౌస్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం కేసీఆర్‌ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్‌వీ రావు తెలిపారు.

click me!